Saturday 30 November 2013

బ్రిజేష్ తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం : అనూరాధ irrigation brijesh kumar tribunal

జలయజ్ఞం ప్రాజెక్టులు చేపట్టినప్పుడే ప్రాధాన్యత ప్రకారం నిర్మాణాలు జరగలేదు. వాస్తవ జలాల ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణాలను చేపట్టలేదు. బ్రిజేష్ తీర్పు వలన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. విభజన నేపథ్యంలో ఈ తీర్పు మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుంది. ప్రాతిపదికపై తప్పు జరిగిందని చెబుతున్న కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వం.. ఆ ప్రాతిపదికపై ఎలాంటి వాదనలు చేయలేదనేది వాస్తవం. వాదనలు సరిగా లేకపోవడం వల్లే మిగులు జలాల మీద హక్కును కోల్పోవాల్సి వచ్చింది. ఇక..రాయల తెలంగాణ, తెలంగాణ, భద్రాచలం, హైదరాబాద్ పై చర్చలు చూస్తుంటే.. రాష్ట్రాన్ని కేంద్రం ముక్కలా భావించి ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తుందని అర్థమవుతుంది. అయితే వారికి ప్రజలు ప్రయోజనాలు పట్టడం లేదు. కాంగ్రెస్ తన స్వార్థ ప్రయోజనాల కోసమే రాష్ట్రంతో ఆడుకుంటోంది. బాబుపై ఆరోపణలు చేసేముందు వైసిపి నిజానిజాలు తెలుసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడే జలయజ్ఞంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో వైఎస్ ఆర్ మిగులు జలాలు సరిపోతాయని లేఖ ఇచ్చారు. అప్పుడే బాబు జలయజ్ఞం ప్రాజెక్టులు, మిగులు జలాలపై ఆందోళన చేశారు. ఢిల్లీలో మహరాష్ట్ర, కర్నాటక లాబీయింగ్ బాగానే జరుగుతుంది. ఇంత మంది కేంద్ర మంత్రులు ఉండి కూడా.. రాష్ట్రానికి ఈ విషయంలో అన్యాయం చేశారు. విభజన ప్రక్రియను తెరమీదకు తెచ్చిందే రాజకీయ ప్రయోజనాల కోసం. సోనియా కుట్ర ఫలితంగానే విభజన ప్రకటన ఎన్నికల సమయంలో వచ్చింది. ఇప్పుడు రాయల తెలంగాణ అంశాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసమే తెరమీదకు తెస్తున్నారు.

1 comment: