Tuesday 1 October 2013

రాష్ట్ర విభజన అంశాన్ని పరాయిదేశస్థురాలైన సోనియా నిర్ణయించడం దురదృష్టకరం. అనురాధ, టిడిపి నేత

దురదృష్టకరం - అనురాధ, టిడిపి మహిళా నేత '' రాష్ట్ర విభజన అంశాన్ని పరాయిదేశస్థురాలైన సోనియా నిర్ణయించడం దురదృష్టకరం.ఆమె దేశానికి ప్రధాని కాదు, రాష్ట్ర పతి కాదు. చిచ్చు రాజేయడానికే షిండే రోజుకో ప్రకటన చేస్తున్నారు. టిడిపి లేఖ ఇచ్చినందుకే విభజన చేశామని చెబుతున్నారు. లేఖ ఎప్పుడిచ్చాం? నిర్ణయం ఎప్పుడొచ్చింది?. సమస్యలు పరిష్కరించకుండా విభజించమని చంద్రబాబు ఏరోజూ చెప్పలేదు. యుపిలో స్వయంగా ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా విడగొట్టాలని అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. కానీ దానిపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర విభజన సరైన పని కాదు. 1999లో వైఎస్ ఆర్ తెలంగాణపై సోనియాకు లేఖ ఇచ్చారు. 2004లో కాంగ్రెస్, టిఆర్ ఎస్ తో కలిసి కుట్ర పన్నింది. విభజనకు ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీనే. నిస్సిగ్గుగా కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ఢిల్లీ పెద్దలు చూస్తున్నారు.''.

No comments:

Post a Comment