Wednesday 30 October 2013

సోనియా దూత పురంధేశ్వరి: విభజనపై అనురాధ

విజయవాడ, అక్టోబర్ 16 :రాష్ట్ర విభజన అనివార్యమని కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రోజుకో మాట మాట్లాడుతూ, పూటకో ఆర్భాటం చేస్తున్నారని అనురాధ మండిపడ్డారు. ఒక వైపు రాష్ట్ర విభజన జరిగి, ప్రక్రియపై ముందుకు వెళుతుంటే ఇంక బ్రహ్మాస్త్రం ఎప్పుడు వదులుతారని ఆమె అడిగారు. విభజన జరగదని నమ్మకం ఉంటే హైదరాబాద్ నుంచి తన వ్యాపారాలను ఎందుకు తరలించారని ఆమె లగడపాటిని ప్రశ్నించారు.తాను సమైక్యవాదినేనని, రాష్ట్ర విభజన అనివార్యమైతే వికేంద్రీకరణ చేసి, అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారని కేంద్ర మంత్రి పురంధేశ్వరి అంతకు ముందు అన్నారు. సీమాంధ్ర ప్రజల హక్కులను కాపాడుతామని ఆమె అన్నారు. బుధవారం విజయవాడకు వచ్చిన దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులను స్థానిక నేతలు, పారిశ్రామిక వేత్తలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. పదవిలో ఉంటూనే సీమాంధ్రలో సమస్య తీవ్రత వినిపించవచ్చునని అన్నారు. మనకు కావలిసిన వనరులు, మన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో, దానికి సంబంధించిన అన్ని విషయాలు జీవోఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్)కు తెలియజేస్తామని పురంధేశ్వరి చెప్పారు. కేంద్ర మంత్రి పురంధేశ్వరి సీమాంధ్ర నేతగా కాకుండా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దూతగా మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు. బుధవారం నగరంలో పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అనురాధ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనివార్యమని కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ రోజుకో మాట మాట్లాడుతూ, పూటకో ఆర్భాటం చేస్తున్నారని అనురాధ మండిపడ్డారు. ఒక వైపు రాష్ట్ర విభజన జరిగి, ప్రక్రియపై ముందుకు వెళుతుంటే ఇంక బ్రహ్మాస్త్రం ఎప్పుడు వదులుతారని ఆమె ఎద్దేవా చేశారు. విభజన జరగదని లగడపాటికి నమ్మకం ఉంటే హైదరాబాద్ నుంచి తన వ్యాపారాలను ఎందుకు తరలించారని లగడపాటిని ఆమె ప్రశ్నించారు.

No comments:

Post a Comment