Tuesday 1 October 2013

చంద్రబాబు నాయుడు ఆస్తుల వివరాలు ప్రకటించడం ఆహ్వానించదగిన విషయం.

'చంద్రబాబు నాయుడు ఆస్తుల వివరాలు ప్రకటించడం ఆహ్వానించదగిన విషయం. పార్టీ నేతలు కూడా ఆస్తుల వివరాలు ప్రకటిస్తారు. ఆస్తుల వివరాలు బయటపెట్టాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యలను ఇక్కడ ఉదహరిస్తున్నా. పార్టీకి విరాళాలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆస్తుల వివరాలను స్పీకర్ కు ఇచ్చారు. ఆయన సవాల్ విసరడం తప్పుబట్టాల్సినవసరం లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు చిలవులు వలవులగా చేయడం కరెక్టు కాదు. దమ్ము, ధైర్యం ఉంటే ఆస్తుల వివరాలు ప్రకటించాలి. మాపై వస్తున్న విమర్శలు ఇతర పార్టీల నేతలు ఎలా నడుపుతున్నారు. వైఎస్సార్ పార్టీ తరపున షర్మిల నడుపుతున్న కార్యక్రమం ఎలా నడుపుతున్నారు ? దొంగ బంగారంతో నడుపుతున్నారా ? సీబీఐ, ఇతర అధికారులపై విమర్శలు చేయడం కరెక్టు కాదు. పరిటాల హత్య కేసులో సీబీఐ మంచిది..ఇప్పుడు చెడ్డదా ? కోర్టులను, జడ్జీలను తప్పుబట్టడం కరెక్టు కాదు. చంద్రబాబు నాయుడు పై మొత్తం 32 కేసులు వేశారు. ఏ ఒక్కటి రుజువు కాలేకపోయింది. కేసులను మూసివేశారు అంటున్నారు.. కేసులను మూసివేస్తే కోర్టులు ఊరుకుంటాయా ? జడ్జీలు ఊరుకుంటారా ? ఏదో అవినీతి చేయబట్టే జగన్ ను జైల్లో వేశారు. నన్ను..మిమ్మల్ని ఎందుకు జైల్లో వేయలేదు''.

No comments:

Post a Comment