Wednesday 30 October 2013

నిరసన కార్యక్రమాలు

చంద్రబాబును అవమానించడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వారధి వద్ద టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావు, నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ నేతృత్వంలో రాస్తారోకో జరిపారు. దీంతో 5, 9 జాతీయ రహదార్లపై వచ్చే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పాత చెక్‌పోస్టు సెంటర్‌లో పెనమలూరు నియోజకవర్గం నేత చలసాని వెంకటేశ్వరరావు(పండు), మాజీ మేయర్‌ పంచుమర్తి అనురాధ తదితరులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, నూజివీడు పట్టణాల్లో దేశం కార్యకర్తలు రాస్తారోకోలు, రిలే దీక్షలు నిర్వహించారు. నందిగామ మండలం అనాసాగరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కంచికచర్లకు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టడంతో ముందస్తు చర్యగా కంచికచర్ల పట్టణంలో పోలీసులు 144వ సెక్షన్‌ విధించారు. గుడివాడ పట్టణంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ లంకా దాసరి ప్రసాదరావు, పట్టణ అధ్యక్షులు యలవర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.

No comments:

Post a Comment