Wednesday, 30 October 2013

సోనియా దూతగా పురంధేశ్వరి వ్యాఖ్యలు: పంచుమర్తి అనురాధ

కేంద్ర మంత్రి పురంధేశ్వరి సీమాంధ్ర నేతగా కాకుండా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దూతగా మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు. బుధవారం నగరంలో పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అనురాధ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనివార్యమని కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ రోజుకో మాట మాట్లాడుతూ, పూటకో ఆర్భాటం చేస్తున్నారని అనురాధ మండిపడ్డారు. ఒక వైపు రాష్ట్ర విభజన జరిగి, ప్రక్రియపై ముందుకు వెళుతుంటే ఇంక బ్రహ్మాస్త్రం ఎప్పుడు వదులుతారని ఆమె ఎద్దేవా చేశారు. విభజన జరగదని లగడపాటికి నమ్మకం ఉంటే హైదరాబాద్ నుంచి తన వ్యాపారాలను ఎందుకు తరలించారని లగడపాటిని ఆమె ప్ర

No comments:

Post a Comment