Sunday 6 October 2013

కాంగ్రెస్ ఏకఏపక్ష నిర్ణయం తీసుకుంది.: అనురాధ, టిడిపి నేత :


'రాఘవులు చేసిన సూచనలు బాగున్నాయి. కాని చెప్పడం కొంత వరకు ఈజీయే. నిర్ణయాలు తీసుకోవడం కష్టం. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ ఏకఏపక్ష నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని తొలగించాలని, తెలంగాణ ప్రజల మనోభావాలు పరిగణలోకి తీసుకోవాలని టిడిపి లేఖ ఇచ్చింది. అంతేగాని సీమాంధ్ర ప్రజలను ఏడిపించాలని లేఖ ఇవ్వలేదు. అలాగే హైదరాబాద్ తెలంగాణకు ఇచ్చేయాలని చెప్పలేదు. అఖిలపక్ష సమావేశంలో చెప్పినదానికి టిడిపి కట్టుబడి ఉంది. ఎక్కడా యూ టర్న్ తీసుకోలేదు. సీమాంధ్ర ప్రజల భావాలకు కట్టుబడి ఉన్నానంటూ ప్రభుత్వం చెబుతూ ఉపాధ్యాయులపై ఎస్మా ఎందుకు ప్రయోగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ చేయడం లేదు. కేవలం రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ఇవన్నీ చేస్తున్నాయి. రాష్ట్ర విభజన అంశం చంద్రబాబు చేతిలో ఉంటే సీమాంధ్ర ప్రజలు ఏడ్చేవారు కాదు.సమైక్యాంధ్ర విషయంలో స్పష్టమైన వైఖరి చెప్పాలి''.

No comments:

Post a Comment