Wednesday 9 October 2013

నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని చంద్రబాబు నాయుడు దీక్ష చేపడుతున్నారు.: అనురాధ, టీడీపీ నేత

నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని చంద్రబాబు నాయుడు దీక్ష చేపడుతున్నారు. 13 ఏళ్లు గా సమస్య నలుగుతున్నా పట్టించుకోలేదు. ఎవరికి ఏం చెప్పదలుచుకున్నారో బాబుకు తెలుసు. గత కొంత కాలంగా రాష్ట్రం తగులబడి పోతున్నా పట్టించుకోవడం లేదు. కేంద్ర మంత్రులు మభ్య పెడుతున్నారో తప్ప సమస్యను పరిష్కరించడం లేదు. ఇదంతా పరాకాష్టకు చేరుకున్న తరువాతే బాబు దీక్ష చేపట్టారు. ఈ పాపానికి మూలం వైఎస్. తెలంగాణ కోసం కొంతమంది ఎమ్మెల్యేలను ఎగేశారు. అసలు వైసీపీ అధ్యక్షులు జగన్ ఎందుకు చేస్తున్నారో చెప్పాలి. గతలో తెలంగాణ కోసం తీర్మానాన్ని జగన్ ప్రవేశ పెట్టారు. తెలంగాణకు జై కొట్టి సమైక్యం అన్నారు. తరువాత సమన్యాయం అంటున్నారు. రాజకీయ లబ్ది కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఆర్టికల్ 3 ప్రకారం విభజచించాలని కాంగ్రెస్ కు ఒక దిక్సూచీ చూపెట్టారు. విభజన తరువాత సీమాంధ్ర ప్రాంతానికి సీఎంగా ఉండనని జగన్ చెప్పగలరా ? జగన్ ను భుజాన వేసుకుని మమ్మల్ని పట్టించుకోవడం లేదని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. రాష్ట్రం విడిపోతుందనే సమాచారం ముందే తెలుసని అందుకనే వైసిపి పార్టీ వారు రాజీనామాలు చేశారు

No comments:

Post a Comment