Friday 25 October 2013

ఇప్పుడైనా పిఎం స్పందించాలి - అనురాధ, టిడిపి నేత

సోనియాగాంధీకి తెలియకుండా ఇంత పెద్ద కుంభకోణం జరగదు. ఈ విషయంపై ప్రధాని ఎప్పుడూ స్పందించలేదు. ఫైళ్లు మాయమైనప్పుడు కూడా నాకు తెలియదని తప్పించుకున్నారు. కనీసం ఇప్పుడైనా ఆయన దీనిపై స్పందించాలి. ఫరేఖ్ వ్యాఖ్యల అనంతరం ఈ విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. ప్రధానిని ఆ పార్టీ ఇప్పటికే అనేక సార్లు ఫూల్ ని చేసింది. రాష్ట్ర విభజనపై దిగ్విజయ్ వ్యవహార తీరు చాలా అసహ్యంగా ఉంది. విభజనపై తీర్మానం, బిల్లు వస్తుందని దిగ్విజయ్ చెప్పారు. వెంటనే షిండే బిల్లు మాత్రమే వస్తుందన్నారు. కాంగ్రెస్ నేతలంతా డ్రామాలాడుతున్నారు. విభజనపై దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి మాట్లాడాలి. జివోఎంలో ఇరిగేషన్, విద్యుత్, అర్బన్ మంత్రులు లేకపోవడం దురదృష్టకరం''. -

No comments:

Post a Comment